- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ తప్పుడు నిర్ణయాలే నాకు పాఠాలు నేర్పించాయి: బుట్ట బొమ్మ
దిశ, సినిమా: జీవితంలో ఎదురయ్యే సంఘటనలే కాదు కొన్ని నిర్ణయాలు కూడా మన చేతిలో ఉండవంటోంది పూజా హెగ్డే. తాజాగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ సమావేశంలో పాల్గొన్న నటి తన కెరీర్ అనుభవాలపై మాట్లాడింది. మన కష్టానికి ఎలాంటి ఫలితం వచ్చినా సానుకూలంగా స్వీకరించాలని తెలిపింది. పర్సనల్ అండ్ కెరీర్ రెండింటికీ ఇది వర్తిస్తుందని చెప్పింది. అలా రిసీవ్ చేసుకున్నపుడే మనలో పాజిటీవిటి పెరుగుతుందని, ఎలాంటి అనుభవం ఎదురైనా ఆందోళన చెందకుండా పరిష్కరించుకోవచ్చని సూచించింది. 'నేను నా పని విషయంలో లేదా పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఏదైనా తప్పు జరిగితే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తదుపరి అడుగువేస్తా. తప్పుల నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకుని ఈ స్థానానికి చేరుకున్నా. కొన్నిసార్లు మనం ఊహించిన రిజల్ట్ రాకపోయినంత మాత్రాన తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా భావించకూడదు. కొన్నిసార్లు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమే మన జీవితాన్ని మార్చేస్తుంది. నేను ఆ నమ్మకంతోనే ముందుకు సాగుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : నన్ను, నా డబ్బును వాడుకుని నా తల్లిని చంపేశాడు.. భర్త ఆదిల్ ఖాన్ దురానీపై రాఖీ సావంత్ కామెంట్స్