చిరు తాత అంటూ.. ప్రత్యేకంగా విషెస్ చెబుతూ ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్

by Prasanna |   ( Updated:2023-08-22 10:04:59.0  )
చిరు తాత అంటూ.. ప్రత్యేకంగా విషెస్ చెబుతూ  ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్
X

దిశ,వెబ్ డెస్క్: నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. నిజం చెప్పాలంటే చిరుకి ఈ పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే రామ్ చరణ్ కూతురు మెగా ఫ్యామిలీలోకి వచ్చేసింది.. అలాగే చెర్రీ తన తండ్రికి ఈ సారి ప్రత్యేకంగా విషెస్ తెలిపాడు. చిరు ప్రతి పుట్టిన రోజుకు తన తండ్రితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెప్పేవాడు. కానీ ఈ సారి మాత్రం తన గారాల కూతురు క్లీంకారాతో చిరంజీవి ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ ప్రత్యేకంగా, ఫన్నీగా విషెస్ చెప్పాడు. మా చిరుత.. చిరుతాత అంటూ చిరంజీవిని సంబోధిస్తూ తమ తరుపున.. కొత్తగా కొణిదెల ఫ్యామిలీలోకి వచ్చిన తన బేబీ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed