పవన్ కల్యాణ్ ఆ లోపం వల్లే సీఎం కావడం లేదు.. హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-09-05 06:52:29.0  )
పవన్ కల్యాణ్ ఆ లోపం వల్లే సీఎం కావడం లేదు.. హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శివాజీ పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల బుల్లితెర రియాలిటీ బిగ్‌బాస్ సీజన్-7కు కంటెస్టెంట్‌గా వెళ్లి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

అయితే ఆ షోకు వెళ్లకముందు ఓ ఇంటర్వ్యూలో శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘ రెండెకరాల రైతు కొడుకు అయిన నేను భారీ సంఖ్యలో సినిమాల్లో నటించడం అంటే గ్రేటే కదా. నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చాను. నేను ప్రజల గొంతుక ప్రజల తరపున ఎవరు తప్పు చేసినా అడుగుతాను. ఈరోజు నేను 50 లక్షల రూపాయల కారుతో తిరుగుతున్నానని శివాజీ వెల్లడించారు. అలాగే పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన చిన్న తప్పు వల్ల సీఎం కాలేకపోతున్నారు. ఆ లోపం ఏంటో నాకు తెలుసు. ఆ లోపాన్ని సరిదిద్దుకుంటే సీఎం కావడం సులువు. 2029లో ఇది సాధ్యమవుతుంది. అయినా ఇది నా దృష్టిలో చాలా చిన్న విషయం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More: పవన్ కల్యాణ్ ‘OG’లో సూపర్ స్టార్ మహేష్ బాబు?

Advertisement

Next Story