Sarkaru Vaari Paata: ఓటీటీలో ఫ్రీగా సందడి చేయనున్న 'సర్కారు వారి పాట'

by Mahesh |   ( Updated:2022-06-15 13:57:09.0  )
Sarkaru Vaari Paata on amazon prime from june 23
X

దిశ, వెబ్‌డెస్క్: Sarkaru Vaari Paata on amazon prime from june 23| సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా, పరశురామ్ దర్శకత్వంలో నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మే 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు రాబడుతూ మహేష్ బాబు కెరీర్‌లో మరో సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నదియా, నాగబాబు, సముద్రఖని, బ్రహ్మాజీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ ఆకట్టుకునే సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఆమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 23 నుండి ఉచితంగా చూడటానికి అవకాశం కల్పించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో 199 రూపాయలు చెల్లించి రీచార్జ్ చేసుకున్న వారు సర్కారు వారి పాట సినిమాను చూసేలా అవకాశం కల్పించారు. అదే ఓటీటీ భాగస్వాములు 'సర్కారు వారి పాట' కోసం పే పర్ వ్యూ కోసం చర్చలు జరిపారు. అయితే 'సర్కారు వారి పాట' ప్రైమ్ వీడియో వినియోగదారులందరికీ అదనపు ఖర్చు లేకుండా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాక తెలుగు, తమిళ్, మలయాళంలో సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 23 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed