ఏదో ఒక రోజు ఆ కేసులో దొరికిపోతావ్.. జాగ్రత్త అంటూ అనసూయను హెచ్చరించిన నెటిజన్!

by Anjali |   ( Updated:2023-07-06 15:43:56.0  )
ఏదో ఒక రోజు ఆ కేసులో దొరికిపోతావ్.. జాగ్రత్త అంటూ అనసూయను హెచ్చరించిన నెటిజన్!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది యాంకర్ అనసూయ. స్టార్ యాంకర్‌గానే కాకుండా ఈ రంగమత్త వెండితెరపై కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇక ఈ గ్లామర్ భామ ఫోటో షూట్ల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ తన అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే.. ‘‘ఓ నెటిజన్.. జాగ్రత్తగా ఉండు అనసూయ. నీ పేరు, నీ భర్త పేరు డ్రగ్స్ వ్యవహారంలో ఎప్పుడో బయటకు వస్తాయి. ఇప్పుడు తెగ ఎంజాయ్‌ చూస్తూ.. లగ్జరీగా గడుపుతున్నావు. ఒకవేళ ఈ సంగతి గనుక బయటపడితే ఈ ఎంజాయ్ మొత్తం తలకిందులవుతుంది. బ్యాడ్ సిట్యుయేషన్ తప్పక వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. దీనికి బలాన్ని చేకూర్చుతూ మరో నెటిజన్.. వాడు పక్కా డీలర్‌లానే ఉంటాడు మామ అంటూ అనసూయ భర్తను ఉద్దేశించి కామెంట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెటిజన్స్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story