- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటి గుమ్మం ముందు ఆ సింబల్స్.. నటికి షాక్ ఇచ్చిన అభిమాని

X
దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ నుష్రత్ భరుచా అభిమాని నుంచి తనకు ఎదురైన ఓ ఊహించని సంఘటనను గుర్తు చేసుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ఆమె నటించిన హిందీ సినిమా ‘ఛత్రపతి’ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి క్రేజీ ఫ్యాన్స్ మూమెంట్ గురించి మాట్లాడింది.
‘గతంలో ఓ అభిమాని నాకు ఊహించని షాక్ ఇచ్చాడు. మా ఇంటి గుమ్మం ముందు చాలా గిఫ్ట్ కవర్లు పెట్టి వెళ్లిపోయాడు. అది ఓపెన్ చేసి చూస్తే.. అందులో రెండు ముక్కలుగా లవ్ సింబల్స్ ఉన్నాయి. అందులో ఒకదానిపై తనపేరు, మరోదానిపై నా పేరు రాసిపెట్టాడు. నిజానికి అతనెవరో తెలియదు. మా ఇంటి అడ్రస్ ఎలా కనుకున్నాడో కానీ.. ఆ సంఘటనతో షాక్ అయ్యాను. కొన్నాళ్లపాటు భయాందోళనకు గురయ్యాను’ అంటూ వివరించింది.
Read more:
శరీరాన్ని అవమానించే మాటలు.. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా
Next Story