- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Anasuya Bharadwaj: అనసూయ ఏంటీ ఇలా తయారయ్యింది.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు (పోస్ట్)

దిశ, సినిమా: బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అనసూయ ఒకరు. జబర్ధస్త్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంటుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో అమ్మడు ఫేట్ మారిపోయింది. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే టీవీ షోల్లో కూడా మెరుస్తూ సందడి చేస్తుంది.
ఇక చేతినిండా సినిమాలు, టీవీ షోలు ఉన్నప్పటికీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా నిత్యం తన గ్లామర్ షోతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సులు ధరిస్తూ ఆశ్చర్యపరిచే అను బేబి.. తాజాగా గ్రీన్ కలర్ డ్రెస్సులో కర్లీ హెయిర్‌తో విచిత్రంగా దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘ఏంటీ ఈ అవతారం.. ఇలా తయారయ్యావు ఏంటీ’ అని ‘నీకెందుకు ముసలమ్మ ఇవన్నీ’ అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. అయితే.. తనపై ట్రోల్స్ చేసే వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చే ఈ బ్యూటీ.. ఇప్పుడు వస్తున్న ట్రోల్స్‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
(Video Link Credits to Anasuya Bharadwaj Instagram Channel)