- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బూతుల ఎఫెక్ట్.. ‘రానా నాయుడు’ సిరీస్‌పై నెట్ ఫ్లిక్స్ షాకింగ్ డెసిషన్

దిశ, వెబ్‌డెస్క్: విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రలో తొలిసారి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో పరిమితి మించి బూతులు, సెక్స్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో.. వెంకటేష్, రానాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాదు ఈ విమర్శలు చిలికి చిలికి గాలివానగా మారి.. ఓటీటీ కంటెంట్‌పై కోర్టులో కేసు వేయడం వరకు వెళ్లింది. దీంతో నెట్ ఫ్లిక్స్ కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఈ మేరకు పలు బాషల్లో రిలీజ్ అయిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తెలుగు ఆడియోను తొలగిస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఎక్కువ మొత్తంలో అడల్డ్ కంటెంట్ఋతో పాటు సెన్సార్‌కు మించి బూతులు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా.. మార్చి 10 న స్ట్రీమింగ్ అయిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ వ్యూస్ పరంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: “పుష్ప 2”లో సాయి పల్లవి నటిస్తోందంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ బ్యూటీ