'సెక్స్ లేదా షారుఖ్' మాత్రమే మార్కెట్లో అమ్ముడుపోతాయి: 'Pathaan'పై నేహా

by Prasanna |   ( Updated:2023-02-08 16:10:25.0  )
సెక్స్ లేదా షారుఖ్ మాత్రమే మార్కెట్లో అమ్ముడుపోతాయి: Pathaanపై నేహా
X

దిశ, సినిమా: ప్రముఖ నటి నేహా ధూపియా షారుఖ్ నయా మూవీ 'పఠాన్' గురించి ఆసక్తికర ట్వీట్ చేసింది. 2004లో వచ్చిన 'జూలీ' సినిమాలో సెక్స్ వర్కర్‌గా కనిపించిన ఆమె తన ఇంటిమేట్ సీన్స్‌ను ఉద్దేశిస్తూ ఆ సినిమాలో షారుఖ్ ఉంటే బాగుండేదని చెప్పింది. ఎందుకంటే మార్కెట్‌లో 'సెక్స్ లేదా షారూఖ్‌ మాత్రమే సేల్ అవుతాయి' అంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. '20 ఏళ్ల తర్వాత నా మాట నిజమైంది. దిస్ ఈజ్ నాట్ ఏ 'యాక్టర్స్' కెరీర్. ఇదీ కింగ్ ప్రస్థానం' అనే హ్యాష్‌ట్యాగ్‌ని పోస్టుకు జోడించింది. అలాగే 'జూలీ'లో ఎక్స్‌పోజింగ్ చేయడం ద్వారా తాను మల్లికా షెరావత్, బిపాసా బసులను మించిపోయానని ప్రజలు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారన్న ఆమె.. నిజానికి తానెప్పుడూ సెక్స్ సింబల్ ట్యాగ్‌తో ప్రభావితం కాలేదని స్పష్టం చేసింది.


Advertisement

Next Story