ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా.. Neha Dhupia

by Hamsa |   ( Updated:2022-10-22 08:16:52.0  )
ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా.. Neha Dhupia
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ నటి నేహా ధూపియా బాడీ ఇమేజ్ ఇష్యూస్‌కు సంబంధించిన మూస పద్ధతులను బ్రేక్ చేయాలని పిలుపునిచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్, బాడీ స్ట్రక్చర్ గురించి మాట్లాడిన నేహా.. 20 ఏళ్ల వయసులో 'హెవీ బాటమ్' గురించి డీప్‌గా ఆలోచించేదాన్నని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ విషయాలు గుర్తుచేసుకుంటే సూపర్ సిల్లీగా అనిపిస్తుందన్న నటి.. వయసు పెరగడం అనేది బ్యూటిఫుల్ థింగ్ అని, ఇతరుల ఎక్స్‌పెక్టేషన్స్, జడ్జ్‌మెంట్స్ గురించి పట్టించుకోవడం తగ్గించేస్తామని వివరించింది. కాగా '2003లో 'ఖయామత్: సిటీ అండర్ థ్రెట్‌'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా.. 'జూలీ'లో బోల్డ్ పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, పరిశ్రమలోని సెక్స్ సైరన్‌లలో ఒకరిగా మారిపోయినట్లు చెప్పింది. గర్భధారణ సమయంలో బరువు పెరగడంతో బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నా.. ప్రతికూలతలతో కలవరపడకుండా జీవితాన్ని సంపూర్ణంగా కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : ప్రొడ్యూసర్స్ ఎన్ని వేషాలు వేసినా.. లైట్ తీసుకుంటా : స్టార్ హీరోయిన్

ఇవి కూడా చదవండి : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఇలియానా..

Advertisement

Next Story