- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SaripodhaaSanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ సినిమా అప్డేట్.. ట్రైలర్ బ్లాస్ట్‌కు ముహూర్తం ఫిక్స్ ట్వీట్ వైరల్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన హాయ్ నాన్న, దసరా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. అంతేకాకుండా ఈ మూవీస్ పలు అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం నాని నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. దీనిని వివేక్ ఆత్రేయ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇందులో అందాత భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్. జె సూర్య విలన్‌గా నటిస్తున్నాడు.
అలాగే సాయి కుమార్, అజయ్, అదితి బాలన్ హర్షవర్ధన్, అభిరామి కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ మూవీని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 15న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్స్, టీజర్ హైప్‌ను క్రియేట్ చేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్డేట్స్ వదులుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు.
తాజాగా, నాని సరిపోదా శనివారం సినిమా నుంచి క్రేజీ అప్డేట్ విడుదల అయింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘‘సోకులపాలెం ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. అడ్రినలిన్ పంపింగ్ సరిపోదా శనివారం ట్రైలర్‌ని మీకు అందిస్తున్నాను’’ అని డివివి దానయ్య ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. అంతేకాకుండా ఓ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశాడు.