ఆ ఒక్క సీన్ రెండు నెలలు నిద్రపట్టకుండా చేసింది: నాని

by sudharani |   ( Updated:2023-03-16 17:42:01.0  )
ఆ ఒక్క సీన్ రెండు నెలలు నిద్రపట్టకుండా చేసింది: నాని
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ ఫిల్మ్ ‘దసరా’ షూటింగ్ కష్టాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మార్చి 30న ఈ మూవీ విడుదల సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటుడు.. ‘ప్రతిరోజూ డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డంప్ చేస్తుటుంది. అయితే ఆ సీన్‌లో నేను డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే బొగ్గు నాపై పడాలి. దీనికోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్‌తో ఉంటుంది. నేను అనుకున్నట్లుగానే కింద పడ్డాను. కానీ, ఆ సింథటిక్ బొగ్గు నుంచి అనుకున్నంత సులభంగా బయటకు రాలేకపోయాను. నన్ను పైకి లాగడానికి చాలా సమయం పట్టింది. ఆ గ్యాప్‌లో నేను అక్కడ గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ మొత్తం లోపలికి వెళ్లిపోతుంది. ఈ సన్నివేశం చిత్రీకరించిన రోజు ఇబ్బందిగా అనిపించింది. కొన్నిసార్లు నాకు తెలియకుండానే శ్వాస తీసుకున్నా. దీంతో రెండు నెలలపాటు ఇబ్బంది పడ్డాను. సరిగ్గా నిద్ర పోలేకపోయాను’ అని అనుభవాలను షేర్ చేసుకున్నాడు.

Also Read..

‘గాయపడ్డ మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళుతుంది’.. ఉత్కంఠగా చై కస్టడీ

Advertisement

Next Story

Most Viewed