Nandamuri Mokshagna :ఎన్టీఆర్‌ను ఫాలో అయిన బాలయ్య తనయుడు.. సర్జరీ చేయించుకున్నాడా?

by Hamsa |   ( Updated:2023-06-11 08:40:22.0  )
Nandamuri Mokshagna :ఎన్టీఆర్‌ను ఫాలో అయిన బాలయ్య తనయుడు.. సర్జరీ చేయించుకున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఎప్పుడెప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బొద్దుగా ఉన్న ఫొటోలు వైరల్‌ కావడంతో ఇతనెప్పుడు సన్నబడి సినిమాలో చేస్తాడని అనుకున్నారు. తాజాగా, మోక్షజ్ఞ సన్నగా మారిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు ఎన్టీఆర్‌ను ఫాలో అయి సన్నగా అవడానికి సర్జరీ చేయింకున్నాడని అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమా వరకు చాలా లావుగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన యమదొంగ, కంత్రి చిత్రాల్లో సన్నగా ఉండటం చూసి అందరూ షాక్ అయ్యారు. అందుకు కార‌ణం కూడా బేరియాట్రిక్ స‌ర్జ‌రీ అనేది అప్ప‌టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇప్పుడు మోక్షజ్జ విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. త్వరలోనే బాలయ్య వారసుడు సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

Read more: లక్ష బడ్జెట్‌‌తో బాలయ్య మూవీ.. ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలిస్తే షాకే?

Advertisement

Next Story