పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ వీడిపోవడానికి నాగబాబు కారణమా..? ఇన్నేళ్లకు బయటపడ్డ రహస్యం

by Hamsa |   ( Updated:2023-06-13 10:04:21.0  )
పవన్ కల్యాణ్- రేణు దేశాయ్ వీడిపోవడానికి నాగబాబు కారణమా..? ఇన్నేళ్లకు బయటపడ్డ రహస్యం
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో, సినిమా షూటింగ్‌లో పాల్గొంటు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ మూడు పెళ్లిళ్ల విషయంపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. దీనికి పవన్ కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తుంటారు. పవన్, రేణు దేశాయ్ ‘జానీ’ సినిమాలో నటించాక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు.

తాజాగా, వారు విడిపోవడానికి కారణం నాగబాబు అని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 2010లో నాగబాబు తీసిన ‘ఆరెంజ్’ ప్లాప్ అవడంతో అప్పులపాలు అయ్యారు. ఆ అప్పులతో సతమతమవుతున్న సమయంలో పవన్ తన వంతుగా కొంత డబ్బును అన్నకు ఇచ్చి అప్పులు తీర్చాడు. అది రేణు దేశాయ్‌కి నచ్చలేదట. దీంతో అన్నదమ్ములకి సహాయం చేయాలి కానీ ఎంతో కొంత పిల్లల భవిష్యత్తు కోసం కూడా దాచుకోవాలని పవన్‌తో గొడవ పడిందట. ఆ తర్వాత నాగబాబు కొన్ని రోజులకు డబ్బు తిరిగి ఇచ్చేశాడట. కానీ పవన్-రేణు మధ్య కలహాలు ఎక్కువై కొన్ని రోజులకు విడాకులు తీసుకుని విడిపోయారట. విడాకులు తీసుకున్న వెంటనే పవన్ మరో పెళ్లి చేసుకున్నాడు. కాగా, రేణు దేశాయ్ మాత్రం పిల్లలను చూసుకుంటూ పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Also Read: ‘దసరా’ నిర్మాతల వల్ల నేను రూ.70 వేలు లాస్ అయ్యాను: సింగర్ శ్రీను

పవన్ ఫ్యాన్స్ కు బంపర్ ఛాన్స్.. రూ.4,199 మాత్రమే.. త్వరపడండి!

Advertisement

Next Story

Most Viewed