పవిత్రమైన ప్రదేశం‌లో పాడుపని.. చిత్రబృందంపై దాడిచేసిన స్థానికులు

by srinivas |   ( Updated:2022-10-09 14:44:08.0  )
పవిత్రమైన ప్రదేశం‌లో పాడుపని.. చిత్రబృందంపై దాడిచేసిన స్థానికులు
X

దిశ,సినిమా: వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక‌లోని మెల్కోటే ప్రాంతంలో జరుగుతోంది. అయితే పురావస్తు శాఖ స్మారక చిహ్నం సమీపంలో బార్ సెట్ నిర్మించి మూవీ యూనిట్ అక్కడే బస చేసింది. అయితే పవిత్రమైన ప్రదేశం‌లో చిత్ర యూనిట్ చేయరాని పనులు చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు చిత్ర బృందంపై దాడికి దిగారు. బార్ సెట్ నిర్మించి శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని అవమానించారని, నిబంధనలకు విరుద్దంగా, మతపరమైన పనులు చేసి మనోభావాలను దెబ్బ తీస్తూ చిత్రీకరణ చేసారన్న ప్రజలు.. తక్షణమే చిత్ర యూనిట్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

ALSO READ : ప్రభాస్‌ను ఫాలో అవుతున్న మహేష్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story