- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేషన్‌లో విచారణకు హాజరైన రణ్‌వీర్.. న్యూడ్ ఫొటోషూట్‌పై వాంగ్మూలం
దిశ, సినిమా: న్యూడ్ ఫొటోషూట్ కేసులో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌పై ఆగస్టు 22న ముంబై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే విచారణకు సంబంధించి ఆగస్టు 30 వరకు సమయం కావాలని కోరిన రణ్‌వీర్.. చెప్పినట్లుగానే సోమవారం ఉదయం 7గంటలకు చెంబూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అంతేకాదు తన న్యూడ్ ఫొటోషూట్‌పై వాంగ్మూలాన్ని రాతపూర్వకంగా అందజేసిన ఆయన మరిన్ని వివరాలకు తనను సంప్రదించవచ్చని చెప్పినట్లు సమాచారం. కాగా హీరోతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయించేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక రణ్‌వీర్ ఫొటోషూట్ మహిళల మనోభావాలకు భంగం కలిగించేలా ఉందంటూ కొన్ని రోజుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండగా.. భారతీయ శిక్షాస్మృతి(IPC) సెక్షన్లు 292, 294, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని 509, 67(A) కింద అశ్లీలంగా పరిగణిస్తూ కేసు నమోదు చేయబడింది.