- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ పాత్రకైనా నేను రెడీ.. రూల్స్ బ్రేక్ చేస్తా అంటున్న హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే క్లాసికల్ రోల్‌లో మెప్పించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ క్రమంలోనే 'పిప్పా' అనే హిందీ సినిమాలో హీరో ఇషాన్ కట్టర్ సోదరి పాత్రలో నటిస్తోంది. అది తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు. చెల్లి పాత్రలో చేస్తున్నావ్.. ఇక నుంచి ఇషాన్ పక్కన హీరోయిన్‌గా చేయగలవా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
దీనికి స్పందించిన మృణాల్.. ''హీరోయిన్లు హీరోయిన్ల పాత్రలు మాత్రమే చేయాలా..? చెల్లెలి పాత్రలో, భార్య పాత్రలో నటించకూడదా..? అలా నటిస్తే అవకాశాలు తగ్గిపోతాయా..? ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. ఆ రూల్స్ నేను బ్రేక్ చేస్తా. ఎందుకంటే రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేది. అంతే కాదు.. ఏ పాత్రలోనైనా నటింటి.. ప్రేక్షకుల మనసులు గెలుచుకోగలగాలి అదే నిజమైన సక్సెస్ అని నేను నమ్ముతాను. కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత మంచి పాత్ర నేను వదులుకున్నాను అని అనిపించకూడదు. ఇక 'పిప్పా' సినిమాలో చెల్లెలి పాత్ర నాకు ఎంతో నచ్చింది అందుకే చేశాను'' అంటూ మృనాల్ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం.. డైరెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్