కల్కి మూవీకి పాజిటివ్ టాక్.. మంత్రి నారా లోకేష్ స్పెషల్ ట్వీట్

by Rajesh |
కల్కి మూవీకి పాజిటివ్ టాక్.. మంత్రి నారా లోకేష్ స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొనె కీలక పాత్రల్లో నటించిన కల్కి2898 ఏడీ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. కల్కి మూవీకి టెర్రిఫిక్ రివ్యూస్ రావడం నిజంగా సంతోషాన్నిచ్చిందని తెలిపిన ఆయన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొనె, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ కళాకండంతో భారతీయ సినిమాకు కొత్త నిర్వచనం చెప్పారని పేర్కొన్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న అశ్వనీదత్‌కు, తెలుగు సినిమాను గ్లోబల్ లీగ్‌కు తీసుకెళ్లిన స్వప్న, ప్రియాంకలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Next Story