ఆ విషయంలో నాగార్జున కంటే మెగాస్టారే తోపు..? కామెంట్స్ వైరల్!

by Jakkula Mamatha |
ఆ విషయంలో నాగార్జున కంటే మెగాస్టారే తోపు..? కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోస్ పరిచయమైన ఈ నలుగురు హీరోలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. వీరు పరిచయమైన కొద్ది రోజులకే నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతటి క్రేజ్ తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదొడుకులను దాటుకొని తన స్వయం కృషితో మెగాస్టార్‌గా నిలిచారు. అంతే కాదు తన కొడుకు రాంచరణ్‌ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం రాంచరణ్ పాన్ ఇండియా లెవల్‌లో సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

ఇక కింగ్ నాగార్జున సూపర్ సక్సెస్ హీరోగా పేరు ప్రతిష్టలు ఘటించినా కొడుకుల విషయంలో నిర్లక్షం చేశారనే అపవాదు ఉన్నది. అక్కినేని బ్రాండ్ లేకుండా స్వయం కృషితో కొడుకులు ఎదగాలని చూశారట. ఆ నిర్ణయమే ప్రస్తుతం ఆయనకు శాపంగా మారిందని టాక్. నాగార్జున ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వార్త వైరల్ అవుతోంది. ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్, నాగచైతన్య కెరియర్ మున్నాళ్ల ముచ్చటగానే ఉంది. తన కొడుకుల సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నాగార్జున వారి కెరియర్ గురించి ప్రత్యే్క శ్రద్ధ చూపిస్తున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. ఈ విషయంలో నాగర్జున మొదట్లోనే దృష్టి పెడితే బాగుండెదనీ ఇప్పటికీ అందరిలా వరస సినిమాలతో బిజీగా ఉండేవారనీ చెప్తున్నారు. అయితే నాగార్జున కొడుకుల విషయంలో ఫ్లాప్, చిరంజీవి హిట్ అయ్యాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story