- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నిశ్చితార్థం.. ఆనందంలో ఫ్యాన్స్!
దిశ, సినిమా : మెగా ఇంటా వరసగా సంబురాలు జరుగుతున్నాయి. మెగా వారసురాలు క్లింకార వచ్చిన వేళా విశేషం ఏమో కానీ, మెగా ఫ్యామిలీకి మాత్రం కలిసి వచ్చిందనే చెప్పాలి. క్లింకార పుట్టి మరో ఆరు రోజులైతే సంవత్సరం అవుతుంది. జూన్ 20న రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లింకార జన్మించింది. అయితే ఈమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్యామిలీలో వరస సెలబ్రేషన్స్ జరుగుతూ వస్తున్నాయి. చిరుకు పద్మవిభూషన్, వరుణ్ పెళ్లి, పవన్ గెలుపు, అత్తమాస్ కిచెన్ ఇలా ఎన్నో సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే ఇప్పుడు మరో సెలబ్రేషన్ మెగా ఫ్యామిలీలో జరగబోతుందంట. మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విరూపాక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ హీరో గాంజా శంకర్‌తో ఓ సీనిమా చేయబోతన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈయన త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంట. ఓ బిజినెస్ మ్యాన్ కూతురును సాయిధరమ్ తేజ్ ఇష్టపడ్డాడంట, అంతే కాకుండా ఆ అమ్మాయి, మెగా ఫ్యామిలీకి కూడా నచ్చడంతో, త్వరలో నిశ్చితార్థం చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. కాగా, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.