మాస్ మహారాజా రవితేజ 'Dhamaka' మూవీ ట్రైలర్ రిలీజ్..

by Hamsa |   ( Updated:2023-12-14 14:37:43.0  )
మాస్ మహారాజా రవితేజ Dhamaka మూవీ ట్రైలర్ రిలీజ్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా 'ధమాకా'. దీనికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా పెళ్లి సందడి అమ్మడు శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మి్స్తున్నారు. ధమాకా సినిమా డిసెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా థీయేటర్స్‌లోకి రానుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా, 'ధమాకా' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రవితేజ మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టాడు. అయితే ఇందులో మాస్ మహారాజా డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం. రవితేజ ఇటీవల నటించిన చిత్రాలు అన్నీ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అయినా హిట్ అవుతందో లేదో చూడాలి మరి.

Advertisement

Next Story