బీటౌన్‌లో మంచి మనుషులు లేరు.. అక్కడుంటే జీవితాలు నాశనమే

by sudharani |   ( Updated:2023-06-01 06:59:10.0  )
బీటౌన్‌లో మంచి మనుషులు లేరు.. అక్కడుంటే జీవితాలు నాశనమే
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటి మందనా కరిమి తన కూతురు కెరీర్ గురించి తెగ ఆందోళన చెందుతోంది. 2017లో గౌరవ్ గుప్తాన్‌ను పెళ్లిచేసుకున్న నటి ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2021లో వ్యక్తిగత కారణాల వల్ల డైవోర్స్ తీసుకుంది. కాగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్ట్రగుల్ గురించి మాట్లాడిన బ్యూటీ.. తన కూమార్తె బాలీవుడ్‌లోనే ఉండాలనుకుంటుందేమోనని భయపడుతున్నట్లు చెప్పింది. ఎందుకంటే.. ‘నేను బీటౌన్‌లో మంచి వ్యక్తులను వెతకడానికి ప్రయత్నించాను. దురదృష్టవశాత్తూ ఇక్కడ ఎక్కువమంది అద్భుతమైన వ్యక్తుల కంటే.. స్త్రీల పట్ల అగౌరవంగా ఉండే వ్యక్తులే ఎక్కువ కనిపించారు. బాగా పేరుగాంచిన వాళ్లంతా మాలాంటి వాళ్లను చిన్న చూపు చూస్తారు. ఎలాంటి మద్దతు లభించదు. ఈ విషయం నాకు స్పష్టంగా అర్థమైంది’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.

Read More... అందమైన బాడీ ఉన్నా.. ఆ ఆనందమే లేదు: నటి ఎమోషనల్

ఈ అన్యాయంపై మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే.. కంగన

Advertisement

Next Story