- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మతనానికి అర్థం లేకుండా పోయింది : స్కిన్ షోపై మందాకిని
దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి మందాకిని యంగ్ హీరోయిన్ల స్కిన్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. 'రామ్ తేరి గంగా మైలీ'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె అప్పట్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ సీన్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మందాకిని.. కాలానుగుణంగా ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది. 'ఈ రోజుల్లో లైంగికత పెరిగిపోయింది. సినిమాల్లో బూతు, స్కీన్ షో రోజురోజుకీ పెచ్చరిల్లుతోంది. ఒక్కొక్కరూ ముగ్గురు నలుగురితో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. పెళ్లికిముందే పిల్లలను కనేసి వాళ్లకు తండ్రిలేని బాధను మిగుల్చుతున్నారు. గతంలో స్కీన్ షో ఉన్నప్పటికీ అది టెక్నికల్‌గా చూపించేవారు. పిల్లలకు పాలిచ్చే దృశ్యాల్లో స్వచ్ఛమైన అమ్మతనాన్ని చూసేవారు. కానీ ఇప్పుడు అన్నిటికీ అర్థాలు మారిపోయాయి' అంటూ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఇక 1996లో వచ్చిన 'జోర్దార్' సినిమా తర్వాత ఇండస్ట్రీనీ వదిలేసిన నటి కొంతకాలం టిబెటన్ యోగా టీచర్‌గా పనిచేయడం విశేషం.