- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kannappa:మూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు..

దిశ, సినిమా: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
అయితే ఇటీవలె విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప క్రేజ్ మరింతగా పెరిగింది. కన్నప్ప ఓ విజువల్ వండర్‌లా ఉండబోతోందని అందరికీ అర్థమైంది. ఇక ఈ సినిమా థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. కన్నప్ప చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఇది వరకే ప్రకటించారు. తాజాగా మరోసారి ఈ విషయాన్ని విష్ణు మంచు ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.