మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో మరో సూపర్ స్టార్..

by sudharani |   ( Updated:2023-09-30 12:45:13.0  )
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాలో మరో సూపర్ స్టార్..
X

దిశ, సినిమా: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పరమశివుడి మహాభక్తుడు భక్త కన్నప్ప జీవితం ఆధారంగా భారీ బడ్జెట్‍తో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నప్ప పాత్ర చేస్తున్నాడు విష్ణు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ మహా శివుడి పాత్రలో, పార్వతి దేవిగా కంగనా రనౌత్‌ నటించనున్నారని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్, సీనియర్ హీరో మోహన్ లాల్ కీలకపాత్రలో నటించనున్నట్లు కన్‌ఫర్మ్ అయింది. ఇక శ్రీకాళహస్తిలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరగ్గా.. షూటింగ్ అతిత్వరలో న్యూజిలాంజ్‍లో మొదలుకానున్నట్టు తెలుస్తుంది.

Advertisement

Next Story