మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో సితార గ్రాండ్ ఎంట్రీ..!

by Kavitha |   ( Updated:2024-02-26 07:19:22.0  )
మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో సితార గ్రాండ్ ఎంట్రీ..!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ మొదటి సారిగా.. దర్శకుడు రాజమౌళి తో కలిసి పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఇటీవల జర్మనీలో ఈ మూవీకి అవసరమైన ట్రైనింగ్ మహేష్ పూర్తి చేయగా.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్స్ మొదలు పెట్టడానికి రాజమౌళి కూడా రెడీ అవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వర్క్ షాప్స్ లో మహేష్ తో పాటు సితార కూడా పాల్గొంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఈ సినిమాలో సితార కూడా నటిస్తుందా? అనే హింట్ లీకై వైరల్‌ అవుతుంది.

చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సితార.. ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఎవ్వరి సపోర్ట్ లేకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక దీని బట్టి చూస్తే తాత సూపర్ స్టార్ కృష్ణ.. వారసత్వాన్ని తండ్రి మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు, అయితే ఇప్పుడు తన తండ్రి వారసత్వాన్ని సితార రూపంలో ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడానికి రాజమౌళి తెరకెక్కిస్తునటువంటి..ఈ ప్రతిష్టాత్మక సినిమా కన్నా సితారకు గొప్ప లాంచింగ్ ఎక్కడ దొరుకుతుంది. అందుకే మహేష్ బాబు ఈ మూవీలో సితారను ఓ పాత్ర పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

Next Story