Madhavi Latha : సిగ్గు పడాల్సింది మీరు.. నేను కాదు

by sudharani |   ( Updated:2023-09-09 14:02:23.0  )
Madhavi Latha : సిగ్గు పడాల్సింది మీరు.. నేను కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నచ్చావులే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మాధవీ లత. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. సామాజిక అంశాలపై స్పందిస్తూ వైరల్ అవుతుంటుంది మాధవీ. ఈ క్రమంలోనే ఈమె చేసే ప్రతి పోస్ట్ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. అయితే.. తాజాగా మాదవి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఈ మేరకు ‘‘నన్ను సోషల్ మీడియాలో రోజుకు ఎంత మంది తిడతారో తెలుసా.. ఎన్నేన్ని తిట్లు తిడగారో తెలుసా. అయిన కానీ నేను బతికేస్తా. దీన్ని కూడా తప్పుగా తీసుకుని సిగ్గు లేని బతుకు అని అంటుంటారు. మరి సిగ్గు పడే బతుకు ఏంటి. నేను ఎవరినైనా మర్డర్లు, మానభంగాలు చేశానా సిగ్గు పడటానికి. ఒకరి గురించి ఏం తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే మీరు సిగ్గు పడాలి. నేను కాదు. ఒకరు మనల్ని ఏదో అన్నారని చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతే లైఫ్ అంత ఎలా పోరాటం చేయాలి. ఎలా సాధించాలి. సాధించే చోట కిందపడుతా ఉంటాం. కానీ, లేవడం నేర్చుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story