- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లక్కీ భాస్కర్’ టీమ్‌తో బాలయ్య ముచ్చట్లు.. ‘అన్ స్టాపబుల్’ షో న్యూ అప్‌డేట్
దిశ, సినిమా: నందమూరి నట సింహం హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఈ షో మొదటి రెండు సీజన్లు ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ స్టార్స్‌తో, రాజకీయ నాయకులతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే జోష్‌లో దసరా కానుకగా బాలయ్య ‘అన్ స్టాపబుల్ 3’ ను తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఐతే.. ఈ మూడో సీజన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ టాక్ షోకు హీరో దుల్కర్ సల్మాన్ వచ్చినట్లు తెలుస్తోంది. దుల్కర్ నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ‘అన్ స్టాపబుల్’ షోకు హాజరయ్యారట. ఈ రోజే ‘లక్కీ భాస్కర్’ టీమ్‌తో ఎపిసోడ్‌ని చిత్రీకరణ చేస్తున్నారని టాక్. అలాగే.. ఇందులో బాలయ్య దుల్కర్ టీమ్‌తో సరదాగా ముచ్చటించారట. అయితే.. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. కాగా.. ‘అన్ స్టాపబుల్’ ముందు రెండు సీజన్లు సూపర్ డూపర్ హిట్ కాగా.. ఇప్పుడు వచ్చే మూడో సీజన్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం విశేషం.
More News :
unstoppable: బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. దసరాకు అన్ స్టాపబుల్ న్యూ సీజన్