నా ప్రయివేట్ పార్ట్స్‌పై క్రూరంగా కొట్టాడు.. శేఖర్ బాషాపై లావణ్య సంచలన ఆరోపణలు

by Gantepaka Srikanth |
నా ప్రయివేట్ పార్ట్స్‌పై క్రూరంగా కొట్టాడు.. శేఖర్ బాషాపై లావణ్య సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషాపై లావణ్య సంచలన ఆరోపణలు చేశారు. శేఖర్ బాషా తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ప్రస్తుతం నాకు శేఖర్ బాషా నుంచి ప్రాణ హానీ ఉందని ఆమె అన్నారు. తనపై భౌతికంగా దాడి చేసి.. ఇష్టానుసారం బూతులు మాట్లాడాడని ఆవేదన చెందారు. ‘నా చేయి, వీపుతో పాటు ప్రయివేట్ పార్ట్స్‌కు కూడా దెబ్బలు తగిలాయి’ అని కీలక ఆరోపణలు చేశారు. ఈ దాడి విషయంలో ఇప్పటికే శేఖర్ బాషాపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు లావణ్య తెలిపారు. ఉదయ్, ప్రీతీల డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. శేఖర్ బాషా డబ్బులకు అమ్ముడుబోయి నా వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాడని తెలిపారు.

కాగా, ప్రస్తుతం రాజ్ తరుణ్- లావణ్యల వివాదం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని మోసం చేశాడని.. అబార్షన్ కూడా చేయించాడని లావణ్య వాదిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ మాత్రం లావణ్య చేసేవన్నీ ఆరోపణలే అంటూ కొట్టి పారేస్తున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టుల వరకూ వెళ్లింది. తాజాగా స్టోరీలోకి శేఖర్ బాషా ఎంటర్ కావడంతో మరో వివాదం మొదలైంది.

Advertisement

Next Story