Krithi Shetty: వావ్.. వాటే బ్యూటీ.. అందాలతో చంపేస్తున్న కృతిశెట్టి

by sudharani |
Krithi Shetty: వావ్.. వాటే బ్యూటీ.. అందాలతో చంపేస్తున్న కృతిశెట్టి
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి శెట్టి స్పీడ్ ప్రజెంట్ తగ్గింది. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో వరుస ఆఫర్లు రావడంతో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. అయితే.. ‘ఉప్పెన’ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా దక్కలేదు. అంతే కాకుండా తాజాగా వచ్చిన ‘మనమే’ కూడా నిరాశే పరిచింది. దీంతో.. ప్రజెంట్ తెలుగులో ఒక్క మూవీ కూడా అనౌన్స్ చెయ్యలేదు. కానీ తమిళం మూడు, మలయాళంలో ఒకటి మూవీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే.. సినిమాల్లో కనిపించనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటుంది ఈ బ్యూటీ. తన అందాలతో కుర్రాళ్లకు మంచి విందు ఏర్పాటు చెయ్యడమే కాకుండా.. తన నుంచి చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా కృతి షేర్ చేసిన ఫొటోస్ విశేషంగా వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ టైట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీంతో లైకులు కొట్టడమే కాకుండా.. కామెంట్స్‌తో రచ్చ చేస్తు్న్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story