Krithi Shetty : ఆ విధంగా డైరెక్టర్‌ను శాటిస్ ఫై చేసిన కృతి శెట్టి.. వైరల్ న్యూస్

by Hamsa |   ( Updated:2023-05-30 14:46:09.0  )
Krithi Shetty : ఆ విధంగా డైరెక్టర్‌ను శాటిస్ ఫై చేసిన కృతి శెట్టి..  వైరల్ న్యూస్
X

దిశ, సినిమా: కథానాయికలకు లక్ బాగుండి ఇండస్ట్రీలో కలిసొస్తే పర్లేదు కానీ.. అవకాశాలు రాకపోతే మాత్రం దర్శకనిర్మాతలను మెప్పిస్తూ ఉండాలి. లేదంటే ఛాన్స్ రావడం కష్టమే. కాగా తాజాగా కృతి శెట్టి కూడా ఓ డైరెక్టర్ ను ఒక రకంగా శాటిస్ ఫై చేసి అవకాశాలు అందుకుందని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి, తర్వాత వరుస చిత్రాలు చేస్తూ వచ్చింది. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినా కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే దీనికి కారణం డైరెక్టర్ వెంకట్ ప్రభు అని టాక్ వినిపిస్తోంది.

రీసెంట్ గానే ఆయన ‘కస్టడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో చైతన్యకు జోడిగా కృతినే నటించింది. కానీ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ వెంకట్ ప్రభు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ తలపతితో చేయబోయే సినిమాలో కృతిని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె నటన పరంగా డైరెక్టర్ వెంకట్ ని శాటిస్ ఫై చేసిందని.. అందుకే ఆ దర్శకుడు అవకాశం ఇచ్చాడన్న న్యూస్ వైరల్ అవుతోంది.

Read More... స్టార్ హీరోను అందరి ముందు ఘోరంగా అవమానించిన మీనా తల్లి..

లాంగ్ గ్యాప్‌కు కారణం చెప్పుకొచ్చిన సాయి పల్లవి

Advertisement

Next Story