ఎన్నో సార్లు అబార్షన్ అయ్యింది..స్టార్ హీరో మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్!

by Disha Web Desk 8 |
ఎన్నో సార్లు అబార్షన్ అయ్యింది..స్టార్ హీరో మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లి అనేది చాలా కామన్. ఎంత త్వరగా ప్రేమలోపడుతున్నారో అంతే త్వరగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కనీసం ఐదు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడిపోతున్నారు. అలా ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ మధ్య విడాకులు తీసుకొని విడిపోయారు. అలాంటి జంటల్లో బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్, కిరణ్ రావు జంట.

వీరు 2021లో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. విడాకుల అనంతరం వీరు మంచి స్నేహితులుగా మాత్రం కలిసే ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత ఆమె ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ధోబీ ఘాట్ మూవీ షూటింగ్ సమయంలో తన కొడుకు ఆజాద్ పుట్టాడని చెప్పారు.కానీ అంతకముందే తాను సంతానం కోసం ఎంతో ట్రైచేశాను. ఐదు సంవత్సరాలలో ఎన్నో సార్లు నాకు అబార్షన్ అయ్యిందని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఐవీఎఫ్-సరోగసీ ద్వారా ఆజాద్ పుట్టాడు. ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది. వాడు పుట్టిన రోజు నుంచి వాడితో ఉన్న ప్రతి రోజు నాకు గొప్ప రోజు. పిల్లాడి కోసం పదేళ్ల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. ఆరోజులన్నీ నేను వాడితో ఆనందంగా గడిపాను అంటూ చెప్పకొచ్చింది. ప్రస్తుతం కిరణ్ రావు చేసి కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



Next Story