Hero Surya: ‘#సూర్య 42’.. బాహుబలి, కేజీఎఫ్‌లకు మించి ఉంటుంది: మేకర్స్

by Prasanna |   ( Updated:2023-03-22 15:41:02.0  )
Hero Surya: ‘#సూర్య 42’.. బాహుబలి, కేజీఎఫ్‌లకు మించి ఉంటుంది: మేకర్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో వస్తున్న నయా మూవీ ‘#సూర్య 42’. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేస్తుందంటున్నారు మేకర్స్. ఈ మేరకు గ్రీన్ స్టూడియోస్ పతాకంపై సినిమాను నిర్మిస్తున్న కేఈ జ్ఞానవేల్ రాజా తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘సూర్య నటించిన అన్ని చిత్రాలతో పోలిస్తే.. దీన్ని మూడు రేట్లు ఎక్కువ బడ్జెట్‌తో తీర్చిదిద్దుతున్నాం. ఇది ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ సినిమాలకు మించి ఉంటుంది. పూర్తిగా 16వ శతాబ్దం నాటి కథతో చిత్రీకరిస్తున్నాం. ఈ భారీ ప్రాజెక్ట్ మా కలయిలో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నిజంగా సాహసమే. సినిమా విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క స్టిల్ కూడా లీక్ కాకుండా చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

Mohan Babu: ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. మోహన్ బాబు క్యారెక్టర్‌పై మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed