నీ బేకారుమాటలకు భయపడను.. త్వరలోనే అంతు చూస్తా!

by Anjali |   ( Updated:2023-04-16 12:51:16.0  )
నీ బేకారుమాటలకు భయపడను.. త్వరలోనే అంతు చూస్తా!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌పై కంగన రనౌత్ మరోసారి విరుచుకుపడింది. ఇటీవల ఆమెను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కరణ్.. ‘కంగన మమ్మల్నీ తరచూ మాఫియా అంటోంది. అసలు ఆమె ఉద్దేశం ఏమిటీ? ఆమెకు పని ఇవ్వట్లేదని అలా మాట్లాడుతుందా? మేము మాకు నచ్చినట్లే పని చేస్తాం. ఆమెతో పనిచేసే ఆసక్తి లేదు’ అంటూ కుండ బద్దలు కొట్టాడు. దీంతో వైరల్ అయిన వీడియోపై తనదైన స్టైల్‌లో తాజాగా రియాక్ట్ అయిన నటి.. ‘మీ పనికిమాలిన బేకారుమాటలకు ధన్యవాదాలు. నాకు ఉద్యోగం లేదని, నీ దగ్గర పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని చెబుతున్నావ్ కదా! నేను ఒక నిర్మాత, డైరెక్టర్‌గా నిరూపించుకున్న తర్వాత ఇవే మాటలను మీ మోహాన కొడతా’ అంటూ ఫైర్ అయింది.

టాలీవుడ్ అగ్ర హీరోల సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలల.. చేతిలో ఏకంగా 8 సినిమాలు!

Advertisement

Next Story