తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా.. అమలాపురం టు అమెరికా వరకు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి

by Kavitha |
తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా.. అమలాపురం టు అమెరికా వరకు ప్రభాస్ ఫ్యాన్స్ సందడి
X

దిశ, సినిమా: నేడు ‘కల్కీ 2898AD’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కీ’ మేనియా మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఊగిపోతున్నారు. రెండు స్టేట్స్‌లోని థియేటర్స్ హీరో ప్రభాస్ భారీ కటౌట్స్‌.. బాణాసంచా పేల్చి ఫ్యాన్స్ మాత్రం భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. పలు చోట్ల బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. హైదరాబాద్ లోని ఐమాక్స్ దగ్గర సందడి నెలకొంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కల్కి సినిమా బెనిఫిట్ షోకి ముందుగానే డీజేలతో అభిమానులు హోరెత్తించారు. జిల్లాలోని అన్ని థియేటర్లలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. రోజుకు ఐదు షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామునే థియేటర్ల వద్దకు చేరి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా విజయవాడలోని కల్కి సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్.. డప్పులతో సందడి చేశారు. ప్రభాస్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కల్కి సినిమా ప్రదర్శించే అన్ని థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. థియేటర్ల ఎదుట ప్రభాస్ పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Next Story