- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మోడి’ బయోపిక్ తెరకెక్కిస్తున్న హాలీవుడ్ డైరెక్టర్
దిశ, సినిమా : హాలీవుడ్ హీరో జానీ డెప్ 25 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి దర్శకత్వ బాధ్యత తీసుకోబోతున్నాడు. ఇటాలియన్ ఆర్టిస్ట్ అమెడియో మోడిగ్లియాని బయోపిక్ తెరకెక్కిస్తున్న ఆయన.. ఈ చిత్రానికి ‘మోడి’ టైటిల్ కన్ఫర్మ్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ బుడా పెస్ట్‌లో త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తుండగా.. ప్రసిద్ధ చిత్రకారుడు, శిల్పి అయిన మోడిగ్లియాని జీవితంలో 1916లో అల్లకల్లోలంగా ఎలా మారిందో తెలపబోతోందని తెలుస్తోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పారిస్ వీధులు, బార్‌ల గుండా పారిపోతున్న ఆయన లైఫ్‌లోని 48గంటల గురించి వివరించనుందని సమాచారం.
కాగా పారిస్‌కు చేరుకున్న ఒక్క ఏడాదిలోనే ఊహించని రీతిలో గొప్ప కళాకారుడిగా ప్రశంసలు అందుకున్న ఇటలీకి చెందిన మోడిగ్లియాని.. తన గత కళాఖండాలను చైల్డిష్‌గా ట్రీట్ చేయడం.. మద్యం, డ్రగ్స్‌కు బానిస కావడం.. పబ్లిక్ మీటింగ్స్‌లో కొన్నిసార్లు వస్త్రాలు వదిలేసి నగ్నంగా నిలబడటం.. ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. నిజానికి బతికి ఉన్నప్పటి కంటే చనిపోయాకే అతనికి గ్రేట్ పాపులారిటీని అందించాయి. మద్యమే అతన్ని గొప్పవాడిగా తీర్చిదిద్దిందని తర్వాత తరానికి చెందిన ఆర్టిస్టులు కూడా ఫాలో కావడం.. అతని శైలి ఎంతగా ప్రభావితం చేసిందనే దానికి ఉదాహరణ. కాగా 35ఏళ్ల వయసులోనే టీబీ మెనింజైటిస్‌తో చనిపోయిన అతని జీవితం ఇప్పటికీ చాలా మందికి స్ఫూర్తి.
Also Read...