- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.520 కోట్ల మార్క్ దాటిన 'Jawan' కలెక్షన్లు
దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ 'జవాన్' మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.520.79 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ సోమవారం తెలిపారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రధాన తారగణంగా నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, జవాన్ వెనుక ప్రొడక్షన్ హౌస్, ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ గణాంకాలను'X' (గతంలో ట్విట్టర్) లో షేర్ చేసింది.
'ప్రపంచ వ్యాప్తంగా జవాన్ రూ.520.79 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాసింది. వారాంతపు వసూళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లు సాధించింది' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద, హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు రూ.129.6 కోట్లు వసూలు చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా హిందీ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ డేగా అవతరించింది. మేకర్స్ తెలిపిన లెక్కల ప్రకారం ప్రకారం రెండో రోజు రూ.110.87 కోట్లు, మూడో రోజు రూ.144.22 కోట్లు, నాలుగో రోజు రూ.136.1 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో గౌరీ ఖాన్ నిర్మించారు. సహ నిర్మాతగా గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఎంత సక్సెస్ ఉంటే అంత అందమైన అమ్మాయి వస్తుందంటూ.. Atlee పై ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్
Bunny ఫ్యాన్స్ సిద్ధమైపోండి.. ‘Pushpa 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది