జబర్దస్త్ స్టార్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు?

by Hamsa |   ( Updated:2023-04-24 03:57:11.0  )
జబర్దస్త్ స్టార్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు?
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ స్టార్ కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తునట్టు సమాచారం. చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసీయూలోకి చేర్చినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం గురించి చంటీ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. కాగా, చలాకీ చంటి జబర్ధస్త్ షోలో పలు స్కిట్లు చేసి జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అయితే చంటి గత కొద్ది కాలంగా అటు సినిమాల్లో, బుల్లితెర షోలకు దూరంగా ఉంటున్నాడు.

Also Read..

చలాకీ చంటి ఆరోగ్యంపై కీలక అప్డేట్

puri jagannadh: వరుస చిత్రాలతో వచ్చేస్తున్న పూరి జగన్నాథ్

Advertisement

Next Story