- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆసియాతో నాకు గొడవలు అవుతున్నాయి.. బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నూకరాజు !
దిశ, సినిమా : పటాస్‌లో తన కామెడీతో అందరినీ నవ్వించి మంచి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి నూకరాజు. ఈయన జబర్దస్త్ కామెడీ షోలో అడుగు పెట్టాక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఈయన లేడీ కమెడియన్ ఆసియాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే.
అయితే వీరు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంటారు. కానీ తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా, ఆసియా పుట్టిన రోజు నూకరాజు విష్ చేయకపోవడంతో ఈ వార్తలు మరింత బలం చేకూరింది.
కాగా, ఆసియాతో గొడవలు, బ్రేకప్‌పై ఎట్టకేలకు నూకరాజు క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పారు. నూకరాజు మాట్లాడుతూ... ఆసియాకు మీకు గొడవలు జరుగుతున్నాయా? మీరు బ్రేకప్ చెప్పుకున్నారా అంటూ నాకు చాలా కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. అయినా ఇలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఆసియా బర్త్‌డేకి విష్ చేయలేదు.అయితే దీనికి కూడా ఒక కారణం ఉంది.మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కానీ మేము విడిపోయాం అని వార్తలు మాత్రం తప్పు. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు నేనే కారణం.నేను ఓ ఈవెంట్‌కి 10 తేదీన వెళ్తే 13కి వచ్చేస్తా అనుకున్నాను కానీ లేటు కావడం వలన 15కి వరకు అక్కడే ఉన్నాను. దీంతో ఆసియా నాకు మెసేజ్ చేసింది నేను రెస్పాండ్ కాలేదు.తాను కాల్ చేస్తేనే.. నేను మాట్లాడాలి అన్నట్లు ఉండిపోయాను. అందుకే తన పుట్టిన రోజుకు విష్ చేయలేదు. చివరికి తనే నాకు మెసేజ్ చేసింది. దీంతో నా మీద కోపం లేదా అని అడిగాను, లేదు బాధ ఉందని చెప్పింది. అబ్బాయిలు నాలా ఉండకండి.. తప్పు ఎవరిదైనా మీరే మాట్లాడండి. ఇలా పంతాలకు పోయి విడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం నేను ఆసియా బాగానే ఉన్నాం. తన బర్త్ డేకి విష్ చేయకపోయినా తనకి ఏదైనా సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాను అంటూ నూకరాజు అసలు విషయం చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.