- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా బ్రేకప్స్ కౌంట్ చేయడం కష్టమే: రష్మీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి బుల్లితెర షోలలో యాంకరింగ్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఇక బుల్లితెర స్టార్ జంట అంటే మొదటగా గుర్తొచ్చేది సుధీర్-రష్మీ. వీరిద్దరు స్టేజ్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పండగే. ఇటీవల ఈ కపుల్స్ పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అవన్నీ అవాస్తవాలనీ రష్మీ క్లారిటీ ఇచ్చింది. మొన్న రిలీజైన ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి సరసన రొమాంటిక్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచి.. తెలుగులో రీమేక్ చేసిన ‘బాయ్స్ హాస్టల్’ మూవీలో నటిస్తుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రష్మీ మాట్లాడుతూ.. ‘‘ అందరి జీవితంలో రిలేషన్ షిప్స్, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. 16 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు చాలా మంది ఇలాంటి సిచ్యూవేషన్‌ను ఎదుర్కొంటారు. ఇక నా బ్రేకప్స్ గురించి చెప్పాలంటే.. కౌంట్ చేసి చెప్పడం చాలా కష్టం.’’ అంటూ రష్మీ కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. ఈ యాంకర్ మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈమె లైఫ్‌లో ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో అని జనాలు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మీ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.