Mahesh Babu- Namratha: మహేష్-నమ్రత‌ల పెళ్లి అంత సీక్రేట్‌గా చేయడానికి కారణం ఆమెనా..? ఎట్టకేలకు బయటపడ్డ షాకింగ్ నిజం

by Kavitha |   ( Updated:2024-07-22 15:05:58.0  )
Mahesh Babu- Namratha: మహేష్-నమ్రత‌ల పెళ్లి అంత సీక్రేట్‌గా చేయడానికి కారణం ఆమెనా..? ఎట్టకేలకు బయటపడ్డ షాకింగ్ నిజం
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపూల్ మహేష్ బాబు - నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ పెళ్లిని వీరు ఎంత సింపుల్గా చేసుకున్నారో పెళ్లి ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. అప్పట్లో చాలా మంది జనాలు అంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయిన వీళ్లు ఎందుకు అంత సింపుల్గా పెళ్లి చేసుకున్నారు అని షాక్ కూడా అయ్యారు. అయితే వీరి పెళ్లి అంత సాదాసీదాగా చేసుకోవడానికి ఓ వ్యక్తి కారణమయ్యారట.. ఆమె తమ పెళ్లి ఎక్కడ చెడగొడుతునందోనని భయపడి సీక్రెట్‌గా అలా కానిచ్చేశారట. ఇంతకీ మహేష్ బాబు, నమ్రతల పెళ్లి చెడగొట్టాలని చూసింది మరెవరో కాదు మహేష్ బాబు అమ్మమ్మ ఇందిరా దేవి తల్లి దుర్గమ్మ.. ఏంటీ నిజమా.. అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ- విజయ నిర్మల పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు, నమ్రత సింపుల్ పెళ్లికి సంబంధించిన షాకింగ్ విషయాలను తెలియజేశారు. మహేష్ బాబు పెళ్లి ఎందుకు అలా జరిగింది అని ఇంటర్వ్యూయర్ అడగగా.. కృష్ణ మాట్లాడుతూ.. “మహేష్ బాబు అమ్మమ్మ దుర్గమ్మకు భయపడి అలా రహస్యంగా ముంబైలో పెళ్లి చేసాం. ఎందుకంటే మహేష్ బాబు అమ్మమ్మకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నమ్రతను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఒప్పుకోలేదు. ఈ కారణం చేతనే మహేష్ బాబు పెళ్లి సీక్రెట్‌గా సింపుల్‌గా ముంబైలో చేయవలసి వచ్చింది” అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.

అలాగే విజయ నిర్మల మాట్లాడుతూ.. “మహేష్ బాబు నమ్రతల పెళ్లి ఆపాలని మా అమ్మ ఎంతగానో ట్రై చేసింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ భయపడి పెళ్లిని రహస్యంగా ఉంచాం. అయినప్పటికీ పెళ్లి జరుగుతుంది అనే విషయం తెలుసుకుని ఎక్కడ చేస్తున్నారు అని అడగగా తిరుపతిలో జరుగుతుందని అబద్ధం చెప్పి ముంబైలో సీక్రెట్‌గా పెళ్లి చేశాము” అంటూ విజయనిర్మల చెప్పుకొచ్చారు. అయితే క్యాస్ట్ ఫీలింగ్ కారణంగా నమ్రత‌తో చాలా రోజులు మహేష్ బాబు అమ్మమ్మ మాట్లాడలేదట. ఇక మహేష్ పెళ్లయిన రెండు సంవత్సరాలకే ఆమె చనిపోయింది. కాగా అప్పటి ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Read more...

MAHESH BABU-SITARA: సితార హైదరాబాదులో ఏ స్కూలులో చదువుతుందో తెలుసా?


Advertisement

Next Story