Salaar 2 కంటే ముందే ప్రశాంత్ నీల్ K.G.F: Chapter 3 చేయనున్నాడా?

by Anjali |   ( Updated:2023-08-13 12:22:32.0  )
Salaar 2 కంటే ముందే ప్రశాంత్ నీల్ K.G.F: Chapter 3  చేయనున్నాడా?
X

దిశ,సినిమా: ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రల్లో ‘సలార్’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. కాగా మొదటి భాగం సెప్టెంబర్ 28న విడుదలకానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘సలార్ పార్ట్ 2’ కంటే ముందు ప్రశాంత్ నీల్ వేరే సినిమాను చేయనున్నారట. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించి ‘కేజీఎఫ్ చాప్టర్ 1’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీస్ దేశవ్యాప్తంగా ఎలాంటి హిట్ అందుకున్నాయే చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ గురించి హింట్ ఇచ్చాడు. ప్రభాస్ ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ రిలీజైన వెంటనే ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడట. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Read More : Mr. Perfect : సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Advertisement

Next Story