Renu Desai: అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను మూయించడమేనా స్వేచ్ఛ అంటే.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

by Kavitha |   ( Updated:2024-08-13 11:15:33.0  )
Renu Desai: అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను మూయించడమేనా స్వేచ్ఛ అంటే.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ యానిమల్ లవర్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో.. రీసెంట్‌గా కోల్‌కత్తాలోనీ ఆర్ జీ కర్ మెడికల్ హాస్పిటల్‌లో ఓ ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం గురించి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో భాగంగా drkajalsinghh అనే ఇన్‌స్టా గ్రామ్ ఐడీ ద్వారా ఓ డాక్టర్ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి చంపారు అయినా అది మనకు ఓకే కదా అని ఓ సంచలన కామెంట్స్ చేసింది.

ఇదిలా ఉంటే.. ఆగస్టు 15, 2024 నాటికి మనకు స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అయితే మనం ఎలాంటి స్వేచ్ఛను జరుపుకుంటున్నామనేది ప్రాథమిక ప్రశ్న? అంటూ drkajalsinghh ఇన్‌స్టా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

పనిలో ఉన్న మహిళపై అత్యాచారం చేసే స్వేచ్ఛనా?

అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే స్వేచ్ఛనా?

అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను మూయించే స్వేచ్ఛనా?

మీకు దగ్గరగా ఉన్నవారు అత్యాచారం చేసే వరకు మౌనంగా ఉండే స్వేచ్ఛనా?

వైద్యులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పట్టించుకోకుండా నిశ్శబ్ద ప్రేక్షకుడిగా మారడానికి స్వేచ్ఛనా? అంటూ రాసుకొచ్చింది.

Read More..

Senior actress Sridevi : అతిలోక సుందరి జ్యువెలరీ కలెక్షన్.. మహారాణులు కూడా ఆమె ముందు దిగదుడుపే...

Advertisement

Next Story

Most Viewed