- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాలీవుడ్ స్టార్ హీరోకు ఇండియన్ సిటిజన్ షిప్.. ట్విట్టర్ వేదికగా క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇండియన్ సిటిజన్ షిప్ లభించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా సిటిజన్ షిప్ వచ్చిందని వెల్లడించారు. అక్షయ్ కుమార్ కెనడా ప్రవాస భారతీయుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశంలో శాశ్వత పౌరసత్వం కోసం అప్లై చేసుకున్నారు. భారత ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ నుంచి పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించిన సర్టిఫికేట్‌ను ట్విట్టర్ వేదికగా ఫోటోను పంచుకున్నారు.
ఆ సర్టిఫికేట్‌లో ప్రీవియస్ నేషనాలిటీ కెనడా అని ఉంది. ‘దిల్ ఔర్ సిటిజన్ షిప్, డోనో హిందుస్తానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇండియన్ సిటిజన్ షిప్ లభించినందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. 2011 తర్వాత ఆయనకు కెనడా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా.
Read More: ‘భోళా శంకర్’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ట్వీట్ వైరల్