OTT Movie: ఓటీటీలో సందడీ చేస్తున్న ఇనయా సుల్తానా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Prasanna |   ( Updated:2024-09-04 14:38:11.0  )
OTT Movie: ఓటీటీలో సందడీ చేస్తున్న ఇనయా సుల్తానా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అయినా మూడు వారాల తర్వాత ఓటీటీలో సందడీ చేస్తుంది. ఇంక ప్రతి శుక్రవారం ఏవో ఒక కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడులవుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ఓటీటీ సంస్థలు ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. అలా మూడు నెలల కిందట థియేటర్లలో రిలీజ్ అయి ఓ మోస్తరుగా ఆడిన ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ ఇనయా మెయిన్ లీడ్ గా నటించిన మూవీ నట రత్నాలు.

సీనియర్ నటీ అర్చన ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించింది. ఈ ఏడాది మే17న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బీలో యావరేజ్ గా నిలిచింది. కథ బాగున్నా సరైన ప్రమోషన్స్ లో ఫెయిల్ అయ్యారు.

తాజాగా ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఎలాంటి అనౌన్స్ లేకుండానే సెప్టెంబర్ 03 అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ విడుదల తర్వాత దాదాపు 90 రోజుల తర్వాత స్ట్రీమింగ్ కు అవ్వడం గమనార్హం.

Click Here For Twitter Link




Advertisement

Next Story