అలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ మగాళ్లు అస్సలు భయపడరు: మంత్రి రోజా

by Prasanna |   ( Updated:2023-11-20 06:57:46.0  )
అలాంటి చర్యలు తీసుకోకపోతే ఈ మగాళ్లు అస్సలు భయపడరు: మంత్రి రోజా
X

దిశ,వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసారన్న విషయం అందరికి తెలిసిందే. ‘లియో’ సినిమాలో త్రిషతో కలిసి నటించిన మన్సూర్.. ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించానని..అలాగే ‘లియో’ కథ చెప్పగానే త్రిషతో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని భావించానని ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో మన్సూర్ అలీ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు.

మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను మంత్రి ఆర్కే రోజా కూడా తప్పుబట్టారు. మగాళ్ల మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకురావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘ఆడవాళ్ల గురించి మగాళ్లు అసభ్యకరంగా మాట్లాడినప్పుడల్లా, వారిపై కఠినంగా చట్టపరమైన, పోలీస్ చర్యలు తీసుకోవాలి. నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, ఖుష్బూ, నాపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ కావచ్చు. కఠినంగా చర్యలు తీసుకుంటేనే వాళ్ళు భయ పడతారు. మమ్మల్ని ఎలా టార్గెట్ చేసినా రాజకీయాలు, సినిమాల్లో ఎదిగి చూపించాం' అంటూ అని రోజా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

Next Story