అలాంటి సీన్స్‌కు భయపడే ఆ పాత్రలను వదిలేశాను: Anupama Parameswaran

by Anjali |   ( Updated:2023-04-24 08:53:29.0  )
అలాంటి సీన్స్‌కు భయపడే ఆ పాత్రలను వదిలేశాను: Anupama Parameswaran
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో డీజే టిల్లు చిత్రం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తోంది. తమిళ్‌లో కూడా ఓ సినిమాలో నటిస్తోందని సమాచారం. అయితే గత ఏడాది ‘కార్తికేయ 2, 18 పేజెస్’ ఈ రెండు విజయం సాధించిన ఈ బ్యూటీ.. ఆ మూవీలో చేసిన పాత్రల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

పాత్రల ఎంపికపై తాను 2021 వరకు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నానని.. ఇక అదే సమయంలోనే ఆమెకు ‘‘ఫ్రీడమ్‌ @మిడ్‌నైట్‌’’ అనే ఓ షార్ట్ ఫిలింలో అవకాశం వచ్చిందని తెలిపారు. ఆ షార్ట్ ఫిల్మ్‌తో తాను ఎంతో మంచి పేరు సంపాదించుకనడమే కాక.. ధైర్యం కూడా తెచ్చిపెట్టిందన్నారు. ఆ షార్ట్ చిత్రం వల్ల అనుపమలో ఉన్న చాలా భయాలు, అపోహలు పోయాయని పేర్కొన్నారు. అలాగే కొన్ని రోల్స్ చేస్తే ప్రేక్షకులు, తన అభిమానులు ఏమనుకుంటారో అని చాలా పాత్రలు వదిలేశానని చెప్పారు. కానీ ఈ మూవీలో చేశాక తెలిసిందని..మన పాత్ర నచ్చితే కచ్చితంగా ఆదరిస్తారని నమ్మకం కలిగిందంటూ చెప్పుకొచ్చారు.

Also Read..

అనుష్కకి, భూమిక భర్తకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

Advertisement

Next Story