- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాళ్ల సపోర్ట్ మర్చిపోలేను.. రష్మిక కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ రష్మిక మందన్న. ఇటీవల ‘యానిమల్’ మూవీతో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ నేషనల్ క్రష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో బాలీవుడ్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛవా’ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయింది.
ఈ సందర్భంగా మూవీ టీంపై రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ‘ఇదొక పీరియాడికల్ డ్రామా. ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ నటిస్తున్నాడు. నేను శంభాజీ భార్య ఏసు భాయ్ భోంసాలే పాత్రలో కనిపించనున్నాను. అంత పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ లక్ష్మణ్, ప్రొడ్యూసర్ దినేష్ నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. విక్కీ కౌశల్ రత్నం లాంటి వాడు’ అంటూ చెప్పుకొచ్చింది.