అన్న చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారు.. పవన్ మొండోడు ముంచడాలుండవ్: Hyper Aadi

by sudharani |   ( Updated:2023-10-10 15:04:38.0  )
అన్న చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారు.. పవన్ మొండోడు ముంచడాలుండవ్: Hyper Aadi
X

దిశ, సినిమా: జబర్దస్త్ షోతో పాటు ఇతర షోల ద్వారా తన కామెడీతో ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు హైపర్ ఆది. ఇక దీంతోపాటు పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా ఫ్యామిలీని పొగుడుతూ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మేరకు ‘గత 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నా చిరంజీవి.. సినీ సైనికులను తయారు చేస్తుండగా పవన్ జన సైనికులను తయారు చేసి జనసేనాని అయ్యారు. హీరోలకు అభిమానులుంటారు.. కానీ చిరంజీవికి హీరోలే అభిమానులు ఉంటారు. తనపై విమర్శలు వస్తే సినిమా హిట్‌లతోనే చిరంజీవి జవాబు ఇస్తాడు. ఆయన ఎదగకముందు ఎదిగిన తర్వాత చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ అన్న వాటిని పట్టించుకోకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వారిని సైతం క్షమించాడు. చిరంజీవి మంచోడు కాబట్టి ముంచేశారు. కానీ పవన్ మాత్రం మొండోడు. ముంచడాలంటూ ఉండవ్.. అందరి లెక్కలు తేల్చేస్తాడు’ అంటూ ఆది ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Advertisement

Next Story