- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
akkineni akhil: అక్కినేని అభిమానులకు భారీ గుడ్ న్యూస్.. అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్!

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Nagarjuna) చిన్న కొడుకు అఖిల్(Akhil) ‘సిసింద్రీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయి ‘అఖిత్’తో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్(Most Eligible Bachelor), హలో వంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ 2023లో చేసిన ‘ఏజెంట్’(Agent)తో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరం అయిన అఖిల్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు.
ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. అక్కినేని నాగచైతన్య, శోభిత పెళ్లికి ముందే అఖిల్, జైనబ్ రవ్జీ(Zainab Rawji)ల నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ఇటీవల ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. కానీ పెళ్లి ఎప్పుడో మాత్రం వెల్లడించలేదు. అయితే వీరిద్దరు చైతు, శోభిత పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్‌గా కూడా నిలిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అఖిల్ పెళ్లి(Wedding) డేట్ ఫిక్స్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్చి24న అక్కినేని వారసుడు అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను ఇరు కుటుంబ సభ్యులు చూసుకోబోతున్నారట. అయితే ఈ వేడుకకు బిజినెస్ పర్సన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నాగచైతన్య పెళ్లి సింపుల్‌గా జరిగింది కాబట్టి అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటాడేమో అని అంటున్నారు.